వారిని రక్షించండి: ‘మహా’ సీఎంకు చంద్రబాబు లేఖ

10:20 pm, Fri, 3 April 20
chandra-babu-naidu

ఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సహా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ  రాశారు.

ముంబై సమీపంలోని మద్ దీవిలో చిక్కుకున్న రాష్ట్ర జాలర్లను ఆదుకోవాలని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు 60మంది జాలర్లు దీవిలో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు, వీరందరికీ ముంబైలో వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కోరారు.