విశాఖలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్, ఎక్కడంటే…

Cheddi Gang
- Advertisement -

Cheddi Gang

విశాఖపట్నం: విశాఖ నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలపై పోలీసులు అప్రమ్తమయ్యారు. నగర శివార్ల‌లోని పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్‌లో 66 నెంబర్ విల్లా వద్ద ఆ గ్యాంగ్ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. దీంతో వీరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

- Advertisement -

ఈ విల్లా యాజమాని లక్ష్మీనారాయణ హైదరాబాద్ నివాసి. అప్ప్పడప్పుడు విశాఖ వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ విల్లాలో చోరీ జరగనప్పటికీ..  చెడ్గీ గ్యాంగ్ గతంలో నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన సంఘటనలున్నాయి. వీరిని పట్టుకుంటే నగరంలో జరిగిన చోరీలకు సంబంధించి ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -