ఓం ప్రతాప్ మృతి కేసు.. చంద్రబాబు, లోకేశ్, వర్ల రామయ్యకు పోలీసుల నోటీసులు

- Advertisement -

చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యలకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు బండకాడపల్లి దళితవాడలో అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఓం ప్రతాప్ మృతి విషయంలో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

వారం రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. 91 సీఆర్‌పీసీ కింద జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఓం ప్రతాప్ మృతి విషయంలో స్థానిక వైసీపీ మంత్రుల హస్తం ఉందన్న ప్రతిపక్ష నేత, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే వారం రోజుల లోపల తమకు అందించాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -