ఫలితాలు వచ్చే వరకు కిడారిని మంత్రిగా కొనసాగించేందుకు సీఎం ప్రయత్నాలు….

Chandrababu Naidu Varthalu, AP Latest Cabinet News, AP Election News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: గతేడాది మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

గత ఏడాది నవంబర్‌ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే శ్రావణ్ మంత్రిగా కొనసాగలంటే ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. కానీ ఆయన ఏ చట్ట సభలలోను ఎన్నిక కాలేదు. దీంతో 6 నెలల గడువు ముగియడంతో ఆయనతో రాజీనామా చేయించాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.

చదవండి: పీకే పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధానపార్టీలు!గెలిచేదెవరు? ఓడేదెవరు?

ఈ నేపథ్యంలో మంత్రి శ్రావణ్‌కుమార్‌ను సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కొనసాగించవచ్చా? లేక ముందుగానే రాజీనామా చేయించాలా? అన్న అంశంపై సీఎం చంద్రబాబు న్యాయసలహా కోరారు. ఈ మేరకు ఆయన అడ్వకేట్‌ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. శ్రావణ్‌ను కొనసాగించడానికి న్యాయపరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడాలని ఏజీని చంద్రబాబు కోరారు.

చదవండివారిద్దరికీ ఇదే ఆఖరిపోరాటం! మరి విజయం ఎవరిని వరిస్తుందో?
- Advertisement -