తోక కాలిన కుక్కల్లాగా మొరగొద్దు: టీడీపీ నేతలపై కేవీపీ ఫైర్…

2:00 pm, Mon, 6 May 19
congress leader kvp ramchandrarao fires on tdp leaders

 

అమరావతి: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖ రాస్తే, మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అసలు టీడీపీ అధిష్టానం ఆదేశించగానే నేతలు తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని అన్నారు. తనపై టీడీపీ నేతలు దిగజారి అసభ్య వ్యాఖ్యలు చేశారనీ, తాను వారిలా దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు.

చదవండి:40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారే ఆ మాత్రం తెలియదా బాబు!

అయితే ఈ వ్యవహారంలో దేవినేనికి నిజం మాట్లాడటం ఇష్టం లేదో లేక సబ్జెక్టుపై అవగాహన లేదో తెలియడం లేదన్నారు. తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు దేవినేని జవాబు ఇవ్వలేదని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కట్టడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ చెప్పలేదన్నారు. ఒకవేళ ఎలాంటి భారం పడకుంటే ఉమ దానిపై స్పష్టత ఇచ్చి ఉండేవారనీ చెప్పారు.

అలాగే వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడంలో తాను కీలకంగా పనిచేశానని చెప్పుకొచ్చారు.

చదవండి:గోదారొళ్ల దెబ్బకి బాబుకి మైండ్‌బ్లాక్! ఆ పార్టీ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించిందా!