ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షలకు చేరువైన కరోనా కేసులు.. రోజు వారీ కేసుల్లో తగ్గుముఖం

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మూడు లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,96,609కి పెరిగింది.

గతంలో పోలిస్తే రోజు వారీ కేసుల్లో కొంత తగ్గుదల కనిపించడం కొంత ఊరటనిచ్చే అంశం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు.

- Advertisement -

వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 29.05 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు అయింది. రాష్ట్రంలో ఇంకా 84,777 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

అలాగే, ఇప్పటి వరకు 2,09,100 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. తాజాగా, 82 మంది కరోనాతో మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 2,732కు పెరిగింది.

తాజా మరణాల్లో 13 మంది ప్రకాశం జిల్లాలో మరణించగా, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో 8, గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

- Advertisement -