ఆంధ్రప్రదేశ్‌లో భీకరంగా పెరుగుతున్న కేసులు.. గత 24 గంటల్లో 465 నమోదు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,961కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

అలాగే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 3,960 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -

రాష్ట్రంలో తాజాగా 17,609 పరీక్షలు నిర్వహించారు. అందులో 376 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6230కు పెరిగింది. తాజాగా 82 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,065కి చేరింది. రాష్ట్రంలో ఇంకా 3,069 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 19 మందికి కరోనా సోకింది. ఫలితంగా విదేశాల నుంచి వచ్చి కరోనా బారినపడిన వారి సంఖ్య 308కి పెరిగింది. వీరిలో 261 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1423కు చేరింది.

వీరిలో 51 మంది తాజాగా డిశ్చార్జి కాగా, 630 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.

- Advertisement -