ఆంధ్రప్రదేశ్‌లో మరోమారు భారీగా పెరిగిన కరోనా కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోమారు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 425 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. మొత్తం 13,923 మంది నమూనాలు పరీక్షించగా ఈ కేసులు బయటపడినట్టు వైద్యాధికారులు తెలిపారు. తాజా కేసుల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన కేసులే 126 ఉండడం గమనార్హం.

 

- Advertisement -

రాష్ట్రానికి చెందినవి 299 కేసులు ఉన్నాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,496కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 92 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇప్పటి వరకు 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 2,779 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -