ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 24గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ రోజురోజుకూ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కేసుల ఉధృతి

మాత్రం తగ్గట్లేదు. ఇలాంటి సమయంలో శుక్రవారం నాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8147 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య

- Advertisement -

ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2,380 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా రాష్ట్రంలో 49 మంది మృతిచెందారు. జిల్లాలవారీగా

చూస్తే.. తూర్పుగోదావరిలో 11మంది, కృష్ణాలో 9మంది, కర్నూలులో 8మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో చనిపోయారు. 

- Advertisement -