ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్! విజయం పై పార్టీలధీమా!

10:36 am, Thu, 9 May 19
YS jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Election News, Newsxpressonline
అమరావతి: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నేటి నుండి సరిగ్గా మరో 15 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఎక్కడ చూసినా నరాలు తెగే ఉత్కంఠత తో అందరూ ఎదురుచూస్తున్నారు. నేతలు గెలుపోటములపై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 23న కౌంగింగ్ జరగనుంది.

దీని బట్టి చూస్తే సరిగ్గా 43 రోజుల వ్యవధి రావడంతో ఇటు జనంలో కాస్త అసహనం పెరిగింది. ఏపీలో ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరి పోరు సాగింది. కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది అనే అంచనా వేస్తున్నారు. దీంతో పలుచోట్ల త్రిముఖ పోరు తప్పేలా లేదు.

కొన్నిచోట్ల జనసేన చీలిక ఓట్లే విజయానికి కీలకం కానున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు కూడా జరుగుతున్నాయి. చివరి రెండు వారాల కావడంతో పందాల జోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
చదవండి: ఈ చర్చ నిజమైతే జనసేనకి తిరుగు లేనట్టే….!

ఇకపోతే ఎన్నికల ముందు వరకు జనసేన ఎఫెక్ట్ పెద్దగా ఉండదని టీడీపీ,వైసీపీ నేతలు భావించారు. అయితే పోలింగ్ తర్వాత ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు పదిశాతంపైనే ఓట్లు వస్తాయన్న కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. రెండుమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా ఎక్కువే ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు పలుచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగనట్లు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాకినాడ, రాజమహేంద్రవరం, పార్లమెంట్ స్థానాల్లో ఇది మరింత ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సీటులో జనసేన అభ్యర్థిని బలపరిచిన వారు పార్లమెంట్ సీటు టీడీపీకి వేసినట్లు రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అంచనాలు సాగుతున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకు విషయంలో పార్లమెంట్ పరిధిలో తేడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఫలితాలు ఎప్పుడొస్తాయా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బూత్‌లు, గ్రామాల వారీగా తమకు పోలైనఓట్లలో తమకు ఎన్ని ఓట్లు వచ్చాయన్న దానిపై ఒకటికి పదిసార్లు అంచనా వేసుకుంటున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్ కార్యకర్తలతో విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థులు రాజకీయ భవితవ్యం తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.