ఏపీ కేబినెట్ భేటీకి డేట్ ఫిక్స్! సీఎస్ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ!

3:02 pm, Tue, 7 May 19
Chandrababu Naidu Varthalu, AP Latest Cabinet News, AP Election News, Newsxpressonline

అమరావతి: ఎన్నికలు ముగిసినప్పటినుండి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. గత కొద్దీ రోజులుగా అప్ సీఎం చంద్రబాబు ,సీఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తాజాగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశానికి ముహూర్తం ఖరారయింది. మే నెల 10న ఏపీ కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎంవో నుండి సమాచారం అందింది.

దీనిలో భాగంగా ఏపీ కేబినెట్ అజెండాను రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు సమావేశం జరపాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్ కు నోట్ పంపించారు. ఇంకా ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ వర్గాలలో , అటు అధికార వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠత నెలకొంది. కాగా, ఈ కేబినెట్ భేటీలో ఫణి తుపాను ప్రభావం, నష్టపరిహారం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, వేసవిలో మంచినీటి సమస్యలపై చర్చించే అవకాశముందని సమాచారం.

చదవండి:  టీడీపీ, కాంగ్రెస్ లకు బిగ్ షాకిచ్చిన సుప్రీం!