బంగాళాఖాతంలో వాయుగుండం.. తుపానుగా మారే అవకాశం…

deep-depression-in-bay-of-bengal
- Advertisement -

deep-depression-in-bay-of-bengal

అమరావతి: బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడింది. కళింగపట్నంనికి 690 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 720 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం ఏర్పడినట్లు విపత్తుల శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

రాబోయే 24 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మరే అవకాశం ఉందని, 48 గంటల్లో తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మరే అవకాశం కూడా ఉందని వారు వెల్లడించారు.

దీని ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, తీరం వెంబడి గంటకు 60 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు చేశారు.  వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని కూడా విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది.

- Advertisement -