అయ్యన్నపాత్రుడిపై దిశ కేసు.. ఓ మాజీ మంత్రిపై ఇదే తొలిసారి!

- Advertisement -

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి‌పై దిశ చట్టం కింద కేసు నమోదయింది. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మున్సిపల్ కమిషనర్ టీ కృష్ణవేణి ఫిర్యాదు

చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న తనతో అనుచితంగా ప్రవర్తించారని కృష్ణవేణి ఆరోపించారు.

- Advertisement -

దీంతో అయ్యన్న పాత్రుడిపై దిశ చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. వీటితో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా కేసు నమోదు చేశారని

తెలుస్తోంది. అయ్యన్నను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక మాజీ మంత్రిపై దిశ చట్టం కింద కేసు నమోదవడం ఇదే తొలిసారి.

- Advertisement -