కుటుంబంలో విభేదాలుంటే హత్యలు చేసుకుంటారా: వివేకా కుమార్తె

11:09 am, Wed, 20 March 19
YS viveka Murder Latest News, Viveka's daughter says to about viveka murders news, Newsxpressonline

పులివెందుల: తన తండ్రిని అత్యంత క్రూరకంగా హత్య చేశారని, దానిపై విచారణకు సిట్ టీమ్ ఏర్పాటు అయినా, పారదర్శకంగా విచారణ సాగడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. తన తండ్రికి జగన్ సీఎం కావాలన్న కోరిక ఉందని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. దీనిపై ఓ వర్గం మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని అన్నారు.

ఇంట్లో వారు హత్యలు చేస్తారా…

ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన సునీత, కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడారు. సొంత కుటుంబీకులే పెద్దాయనను చంపారని ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడం ఆయన పైశాచిక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించిన ఆమె, తన పనిని తాను చేసుకునేందుకు సిట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ కుటుంబంలో దాదాపు 700 మందికి పైగా ఉన్నామని, ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని విభేదాలుంటాయని, అంతమాత్రాన హత్యలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.

తమ కుటుంబంలో పెద్దలను ఎంతో గౌరవిస్తామని చెప్పారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెంగళూరులో ఉన్న భూమిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. సిట్ విచారిస్తున్న సమయంలో తాను విచారణపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయాలని భావించడం లేదని, ఈ విషయంలో తన అభిప్రాయం కన్నా, తేల్చాల్సిన సంగతులే ముఖ్యమని అన్నారు.