మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ఇచ్చారు: ఎన్టీఆర్ మరణంపై డాక్టర్ సంచలనం

11:23 am, Tue, 2 April 19
NTR's death issue News, NTR Latest News, AP Latest News, Newsxpressonline

హైదరాబాద్/అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) మరణంపై డాక్టర్ కుసుమ రావు సంచలన విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ మరణం సహజమైనది కాదని ఆమె తెలిపారు.

మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్‌ను ఎన్టీఆర్‌కు ఇచ్చారనే చర్చ మెడికల్ సర్కిల్స్‌లో జరుగుతోందని డాక్టర్ చెప్పారు. ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని తొలుత చూసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని కుసుమ రావు తెలిపారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిపై ఆమె విమర్శలు చేశారు.

రాజకీయాల్లో లక్ష్మీపార్వతి జోక్యం..

అప్పటి ప్రభుత్వ కార్యకలాపాల్లో లక్ష్మీపార్వతి ఎక్కువగా జోక్యం చేసుకునేవారని ఆమె తెలిపారు. లక్ష్మీపార్వతి సూచనతోనే చంద్రబాబును మంత్రి పదవి నుంచి, పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఎన్టీఆర్ తొలగించారని కుసుమ రావు ఆరోపించారు.

ఎన్నో జన్మల పుణ్యం చేసుకోబట్టే ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతి నిలవగలిగారని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు డాక్టర్ కుసుమ రావు చాలా దగ్గరి స్నేహితురాలు కావడం గమనార్హం. రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ఎన్టీఆర్ చిత్రం విడుదలైన నేపథ్యంలో కుసుమరావు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

చదవండి: మహేశ్ బాబు అభిమానుల సాయం కోరిన గల్లా జయదేవ్

చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: నిజాలు దాస్తే దాగవు, 23 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వర్మ!