ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -

అమరావతి: వైసీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

- Advertisement -

ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తిరిగి ఆయనే నామినేషన్ దాఖలు చేశారు.

ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. నామినేషన్ దాఖలుకు ఈ రోజే చివరి రోజు కావడం, ఒకే ఒక్క నామినేషన్ దాఖలవడంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ.. జగన్ తనకు మంచి అవకాశం ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -