ప్రధాని మోడీపై విశాఖ కుర్రాడి పోటీ.. నామినేషన్ ఆమోదం!

1:01 pm, Sat, 4 May 19

విశాఖపట్టణం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానానికి పోటీ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణలోని నిజామాబాద్ రైతులతోపాటు విశాఖపట్టణానికి చెందిన మానవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు.

జిల్లాలోని జోడుగులపాలెం గ్రామానికి చెందిన 31 ఏళ్ల మానవ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి పరిశీలన అనంతరం దానిని ఆమోదించారు. ఇక, మానవ్ దాఖలు చేసిన నామినేషన్‌కు ఓ ప్రత్యేకత కూడా ఉంది.అందులో మానవ్ కుల, మతాల ప్రస్తావన కానీ, ఇంటి పేరు కానీ పేర్కొనకపోవడం విశేషం.