ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై…

9:31 pm, Mon, 13 May 19
AP cabinet Latest News, Chandrababu Naidu Varthalu, Election commission News, Newsxpressonline

అమరావతి: ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాలుగు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే మంత్రివర్గ సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి…కొన్ని కండిషన్స్ పెట్టింది.

చదవండి: జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి మేలు చేయనుందా?

ఈ సమావేశంలో కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ బకాయిల చెల్లింపులకు అత్యవసరం అయితే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది.  అలాగే కేబినెట్‌ భేటీ అనంతరం నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించరాదని ఆంక్షలు విధించింది.

కాగా, గత కొన్ని రోజులుగా మంత్రివర్గ సమావేశానికి ఏసీ అనుమతివ్వదని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చదవండి: వైసీపీ అభ్యర్ధులే ఎక్కువ చదువుకున్నవారు….