జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వణికిపోతున్న మాజీ సీఎం చంద్రబాబు!

CM YS Jagan News, Chandrababu Naidu News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం నాటి నుండి ఏపీ ప్రజలకి మంచి చేయడానికి, మార్పు తేవడానికి రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రజలకు సంకేతాలు పంపారు. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.

ఇంకా సీఎంగా రెండు రోజులు కూడా పూరి కాకమునుపే జగన్ పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి షాక్ తప్పదు అని చెప్పాలి. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరగకుండా గతంలో చంద్రబాబు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని జగన్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏపీలో సిబిఐ విచారణకు జగన్ అనుమతిస్తు నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలపై విచారణకు సిబిఐకి జగన్ ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే ముందుగా ఇబ్బంది పడేది తెలుగుదేశంపార్టీ నేతలే అన్న విషయంలో అనుమానం లేదు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో అనేకమంది టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు దోచేసుకున్నారు.

ఇసుక, మట్టి, నీరు, భూమి అన్న తేడా లేకుండా ఎవరికి అవకాశం ఉన్నచోట అవకాశం వచ్చినట్లుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో తమ నేతలపై సిబిఐ ఎక్కడ దాడులు చేస్తుందో, కేసులు పెడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు కన్సెంట్ ను రద్దు చేశారు. ఇపుడా కన్సెంట్ రద్దును రద్దు చేస్తు ఓ సవరణ తీసుకురావాలని జగన్ నిర్ణయించారు. దాంతో ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ సిబిఐ ఎంట్రీకి కన్సెంట్ రాబోతోంది.

జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో టిడిపి నేతలకు చెమటలు పడుతోంది. నిజంగానే టిడిపి నేతల అవినీతిపై సిబిఐ దాడులు మొదలుపెడితే పనిలో పనిగా చంద్రబాబు, చినబాబు మీద దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఉన్న కేసులతో చంద్రబాబు సతమతమవుతున్నారు. దానికి తోడు కొత్తగా సిబిఐ దాడులు, కేసులంటే ఇక చెప్పాల్సిన పనేలేదు.

చదవండి: సీఎం హోదాలో జగన్ చేసిన అతి పెద్ద తప్పు..!

- Advertisement -