వైఎస్ జగన్ గురించి ఐదు నమ్మలేని నిజాలు..!

4:16 pm, Thu, 14 March 19
Five Unreliable Facts About Jagan, Newsxpressonline

హైదరాబాద్: వైఎస్‌ జగన్.. ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత. ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నుండి బయటకి వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

ఆ తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని ఎన్నికల బరిలో నిలిపిన జగన్ కొద్దిలో అధికార పీఠాన్ని అధిష్ఠించే అవకాశాన్ని కోల్పోయారు. 

మరికొద్ది రోజుల్లో ఏపీలో జరిగే ఎన్నికల్లో గెలిచి, ఈసారైనా అధికారాన్ని చేపట్టాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి.

వైఎస్ జగన్ ఈసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం ఖాయమని పలువురు జోస్యం చెబుతున్నారు. అయితే జగన్ గురించి ఇప్పటి వరకు సాధారణ ప్రజానీకానికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం..

1 . వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ క్వాలిఫికేషన్ బీకాం. హైదరాబాద్ బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 12 వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజీలో బికాం చదివారు. ఎంబీఏ చేసేందుకు లండన్ వెళ్లినా అది పూర్తి కాకుండానే తిరిగి ఏపీకి వచ్చేశారు.

 2. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్ జగన్. సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాల వల్లే జగన్ బాలకృష్ణ‌కి ఫ్యాన్ అయ్యారని అంటుంటారు. ఇప్పటికీ వీలుదొరికినప్పుడు బాలయ్య సినిమాలు చూస్తుంటాడని సమాచారం.

3. రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగళూరు‌లోని ల్యాంకో హిల్స్‌లో జాబ్ చేసేవారు. ఈ ల్యాంకో హిల్స్ ఎవరిదో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, సర్వేల కింగ్, ఆంధ్రా ఆక్టోపస్‌గా పిలవబడే లగడపాటి రాజగోపాల్‌ది.

 4. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంతగా పార్టీ పెట్టి 70 సీట్లు సాధించారు జగన్. ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఎన్ఠీఆర్ తర్వాత జగన్ ఉన్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. దేశంలో జరిగిన సుదీర్ఘ పాదయాత్రల్లో ఇదొకటి.

5. ఇక జగన్‌ పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి సంచలనం సృష్టించింది. అక్కడ సీటు రావాలంటే కఠోరమైన శ్రమ అవసరం. ఏపీ నుండి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌‌లో సీటు సంపాదించిన అమ్మాయిగా జగన్ పెద్ద కూతురు నిలిచింది. 

ఇక ప్రస్తుతానికొస్తే.. ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం తన దృష్టి మొత్తాన్ని ఈ విషయమైనే కేంద్రీకరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల విషయంలో ఇప్పుడిప్పుడే ఒక అంచనాకి వస్తున్నారు. పార్టీ తరపున అభ్యర్ధులని ప్రకటించిన మరుక్షణం నుండి జగన్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నట్లు సమాచారం.