ఏపీలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి.. వంతెన పైనుంచి కిందికి, మంటల్లో ఐదు బోగీలు…

goods-train-accident-in-prakasam-district-five-oil-tanker-bogies-in-fire
- Advertisement -

అమరావతి: ఏపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పగా రైలుకు చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు వంతెన పైనుంచి కిందికి పడ్డాయి.

దీంతో ఒక్కసారిగా నిప్పంటుకుని అవి మంటల్లో తగలబడుతున్నాయి. ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరు మధ్య ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.  

- Advertisement -

ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే బిట్రగుంట-విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు.. 

అయితే అప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. 

- Advertisement -