నగల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ!

governorpet ci pawan kumar caught taking bribe in Vijayawada
- Advertisement -

governorpet ci pawan kumar caught taking bribe in Vijayawada

విజయవాడ:  గవర్నర్‌పేట సీఐ పవన్‌ కుమార్‌ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. విజయవాడలోని ఓ నగల షాపులో నగలకు సంబంధించిన బిల్లులు సరిగ్గా  లేకపోవడంతో సీఐ తెనాలికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ. ఐదున్నర లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.

- Advertisement -

అయితే  నగల వ్యాపారి ఓ పోలీసు ఉన్నతాధికారి బంధువు కావడంతో పవన్ కుమార్ వ్యవహారాన్ని ఆ వ్యాపారి ఆయనకి తెలియజేశారు. ఈ విషయం చివరికి నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావుకు తెలిసింది.

దీంతో సీఐ పవన్ కుమార్‌పై విచారణ జరపగా ఆ విచారణలో సీఐ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు రుజువు కావడంతో  సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ లంచం డిమాండ్ కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్‌ విష్ణుపై నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -