ఇడుపులపాయ చేరుకున్న జగన్.. ఘన స్వాగతం పలికిన నేతలు

- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు.

రేపు(బుధవారం) జరిగే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వచ్చిన జగన్‌కు ఆత్మీయస్వాగతం లభించింది.

- Advertisement -

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానుమ్, కడప జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు.

వారితో ఉల్లాసంగా ముచ్చటించిన జగన్ ఆపై వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హస్‌లో బస చేసేందుకు వెళ్లారు. వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రేపు మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

- Advertisement -