కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారు: శివాజీ సంచలన వ్యాఖ్యలు!

10:34 am, Sun, 7 April 19
Operation-Garuda-Plan-B--Shivaji-s-Big-Joke--1536466791-1894

అమరావతి: పోలవరం ఓ ఇంజినీరింగ్ అద్భుతమని అన్న సినీ నటుడు శివాజీ ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిపై ట్రూత్‌ పేరుతో వీడియోను ప్రదర్శిస్తూ కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వ్యాఖ్యానించారు. 

చదవండి: ఏపీపై చాలా కుట్రలు, రేపే బయటపెడతా: శివాజీ, నెహ్రూకు మద్దతుగా ప్రచారం

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్న వాన్‌పిక్ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కన్ను పడిందని, తెలంగాణ అవసరాల కోసం ఈ భూముల్లో ప్రైవేట్ పోర్టును నిర్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, ఈ భూముల కోసమే ఆయన వైఎస్ జగన్‌తో దోస్తీ చేస్తున్నారని శివాజీ ఆరోపించారు.

‘‘జగన్‌తో కేసీఆర్ దోస్తీ అందుకే…’’

కేంద్రంలో, ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కచ్చితంగా ఈ భూముల్లో పోర్టును నిర్మించే అవకాశాలు అధికంగా ఉన్నాయనేది తన అనుమానమని, ఇదే గనుక జరిగితే కేసీఆర్ కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారని శివాజీ చెప్పారు. 

చదవండి: ఎన్టీఆర్ మరణం: ఇదీ ఆనాడు జరిగింది, ఎవరీ డాక్టర్ కుసుమ?: లక్ష్మీపార్వతి ఫైర్..

ఈ సమయంలో ఏపీ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకుంటే కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఆపివేయడం ఖాయమన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని, కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపి తీరుతారని శివాజీ స్పష్టం చేశారు. తనకు అనుకూలంగా వచ్చే వారి కోసం కేసీఆర్ ఎంతైనా ఖర్చు చేస్తారని, ఈ మహాయజ్ఞంలో కేసీఆర్ కచ్చితంగా నీళ్లు పోస్తారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

‘‘కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారు…’’

పక్క రాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వారి ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మీ కుటుంబాలకు అన్యాయం చేసుకున్నవారు అవుతారని శివాజీ హెచ్చరించారు. రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. ఆ దారుణాన్ని ఆపాలని, సరైన నాయకుడిని ఎంచుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు. 

చదవండి: జగన్ జాతకం గురించి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!