జగన్‌పై దాడి కేసులో పిటిషన్‌పై.. విచారణను వాయిదా వేసిన హైకోర్టు

high-court-hyderabad
- Advertisement -

high-court-hyderabad

హైదరాబాద్: విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నంపై విచారణ జరపాలంటూ వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, అసలు జగన్ పిటిషన్‌‌కు విచారణ అర్హత ఉందా? లేదా? అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు పేర్కొంది.

- Advertisement -

తనపై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీచేత విచారణ జరిపించాలంటూ జగన్ తాను హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ఏపీ పోలీసులపై నమ్మకం కూడా లేదని అందులో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హత్యాయత్నం కేసు వివరాలను తమ ముందుంచాలని ఏపీ అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది.

అయితే ఈ కేసులో విశాఖ  పోలీసులకు  వైఎస్  జగన్‌మోహన్ రెడ్డి సహకరించలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించగా, పిటిషనర్ తరపున న్యాయవాది కలుగజేసుకుని..  ఏపీ డీజీపీ కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని  ఆరోపించారు.  ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. అసలు జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా?  లేదా? అనేది శుక్రవారం నిర్ణయిస్తామని ప్రకటించింది.

- Advertisement -