ప్రజాప్రతినిధులంతా బంట్రోతులే ..వైసీపీకి బాలయ్య కౌంటర్

3:06 pm, Fri, 14 June 19
Balakrishna Latest News, YCP Leadr Latest News, AP Political News, Newsxpressonline

ఏపీ శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం పేలవంగా ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రసంగంలో ప్రజాసమస్యలను ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వక్యం చేశారు.

చదవండి:కొడెల కుటుంబం అవినీతి అడ్రస్ లాంటిది: వైసీపీ లీడర్

ఇక నిన్న అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబుకు బంట్రోతులు అన్న వైసీపీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలపై బాలయ్య తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులంతా ప్రజల బంట్రోతులేనన్నారు.

అధికార పక్షం అయినా… ప్రతిపక్షం అయినా… ఎమ్మెల్యేలంతా ప్రజా సేవకులే అని… ప్రజలకు బంట్రోతులే అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడింది వారికి బంట్రోతుల్లా పనిచేసేందుకే అని వ్యాఖ్యానించారు.

వైసీపీ పాలనపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన బాలకృష్ణ… ఇప్పుడే ఏం తెలుస్తుంది? మరి కొన్ని రోజులు ఆగాలి అంటూ వెళ్లిపోయారు.