‘‘ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తే.. గైడెన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం..’’

10:28 am, Wed, 10 April 19
junior-ntr-politics-purandheswari-guidance

హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా?.. ఇది చాలామందికి ఆసక్తిరేపే ప్రశ్న. ఏనాటికైనా తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఆయనే సరైన నాయకుడని చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఏమాత్రం కామెంట్ చేయడం లేదు.

తన మానాన సినిమాల్లో తన పని చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎన్టీఆర్ క్రియాశీల రాజకీయ ప్రవేశంపై కామెంట్స్, చర్చలు మాత్రం ఆగడం లేదు. ఎన్టీఆర్‌‌ను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆయన మేనత్త పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ విషయమై పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇంతవరకు ఎన్టీఆర్‌తో రాజకీయపరమైన విషయాలు మాట్లాడలేదని క్లారిటీ పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ కి సినీ పరిశ్రమలో చాలా భవిష్యత్తు ఉందని, సినిమాల్లో కొనసాగుతానని జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకి దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా పురందరేశ్వరి ఉంటుందా..? అనే ప్రశ్నకి బదులిస్తూ.. అంతటి గౌరవం ఇస్తే స్వాగతిస్తానని చెప్పారు. అన్ని విషయాలు విడమరిచి చెప్పడం బాధ్యతగా భావిస్తానని అన్నారు.

అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వనని పురందేశ్వరి స్పష్టంగా తెలిపారు. ఏమో భవిష్యుత్‌లో ఎన్టీఆర్‌కు పురందేశ్వరి సలహాలు అవసరమవుతాయేమో.. ఎవరు చెప్పగలరు..?