వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆస్తుల వివరాలు చూస్తే షాకె…

3:18 pm, Mon, 25 March 19
YCP MLA Roja News, Roja Selvamani Latest News, AP Latest Political News, Newsxpressonline
నగరి: ఏపీలో ఎన్నికలకి సమయం దగ్గర పడేకొద్దీ నేతలు ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఏపీలో నామినేషన్స్ కి ఈ రోజే చివరి రోజు కావడంతో ఇప్పటివరకు నామినేషన్స్ వేయని నేతలందరూ కూడా నామినేషన్స్ వేయడంలో బిజీగ ఉన్నారు. అలాగే ఇప్పటికే నామినేషన్స్ వేసినవారు ప్రచారంలో మునిగిపోయారు. ఇకపోతే ఎన్నికల నియమాల ప్రకారం , నామినేషన్స్ వేసే ముందు తమ అఫిడవిట్ లో తమ స్థిర ఆస్తుల వివరాలని కూడా జత చేయాల్సి ఉంటుంది.

ఆసలు విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా మరోసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22న రోజా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా అందులోని వివరాలు బయటకు వచ్చాయి. తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో రోజా తెలిపారు.

 
ఇందులో స్థిరాస్తులు రూ.4,64,20,669 కాగా, చరాస్తుల విలువ రూ.రూ. 2,74,17,761గా ఉందని వెల్లడించారు. అలాగే తన పేరుపై రూ.49,85,026 అప్పు ఉందని తెలిపింది. అలాగే కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరిట రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో రోజా తెలిపారు. అలాగే తన దగ్గర కోటి రూపాయలు విలువ చేసే మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నాయన్నారు.
 
2017-18లో ఆదాయ పన్ను శాఖకు రూ.52,63,291 చెల్లించామన్నారు. అలాగే తన భర్త సెల్వమణి పేరుపై ఎలాంటి స్థిరాస్తులు లేవనీ, రూ.58 లక్షల విలువైన చరాస్తులు మాత్రం ఉన్నాయని వెల్లడించారు. అలాగే సెల్వమణి పేరుపై మరో రూ.22 లక్షల అప్పు ఉందన్నారు.

ఇకపోతే రోజా తన వాక్చాతుర్యం తో ఏపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. వైసీపీలో జగన్ తరువాత అధికార పక్షాన్ని ఆ లెవెల్ లో మాట్లాడటం ఒక్క రోజాకు మాత్రమే చెల్లింది. తనకున్న సినీ ఇమేజ్ , అలాగే జగన్ ఇమేజ్ తో టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమనాయుడు నే ఓడించి మొదటిసారిగా 2014 లో అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఆ తరువాత అసెంబ్లీ లో సైతం తన మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. కాగా ప్రస్తుతం మళ్ళీ నగరి నుండే వైసీపీ తరుపున బరిలో నిల్చింది.