ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తాజా సర్వే! ఏపీలో వైసీపీదే హవా, ఎన్డీఏకు పూర్తి మెజారిటీ…

10:32 am, Tue, 9 April 19
latest sarvey.., newsxpress.online

ఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 295 సీట్లను గెలుచుకోనుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని అంచనా వేసింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 127 సీట్లు వస్తాయని, ఇతరులకు 121 సీట్లు రావచ్చని ఈ సర్వే వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా అంచనాలను పరిశీలిస్తే…

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 80 కాగా.. అక్కడ బీజేపీ 46, బీఎస్పీ 13, సమాజ్ వాదీ 15, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నాదళ్ 1 స్థానంలో గెలవవచ్చు. 
ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అక్కడ బీజేపీ 4, కాంగ్రెస్ 1 చోట గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజస్థాన్‌లో మొత్తం లోక్‌సభ స్థానాలు 25.  వీటిలో బీజేపీ 19, కాంగ్రెస్ 6 గెలుచుకోవచ్చని సర్వే వెల్లడిస్తోంది.

ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే.. ఇక్కడ మొత్తం లోక్‌సభ స్థానాలు 42. వీటిలో తృణమూల్ కాంగ్రెస్ 29, బీజేపీ 12, కాంగ్రెస్ 1 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఒడిశాలో 21 సీట్లుండగా… బిజూ జనతాదళ్ 13, బీజేపీ 7, కాంగ్రెస్ 1 గెలుచుకోబోతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో 29 సీట్లుండగా… బీజేపీకి 23, కాంగ్రెస్‌కు 6 దక్కవచ్చు.
ఛత్తీస్‌గఢ్‌లో 11 సీట్లుండగా… కాంగ్రెస్ 6, బీజేపీ 5.
పంజాబ్‌లో 13 సీట్లుండగా… కాంగ్రెస్ 10, ఆకాలీదళ్ 3.
హర్యానాలో 10 సీట్లుండగా… కాంగ్రెస్ 1, బీజేపీ 9.
బీహార్‌లో 40 సీట్లుండగా… బీజేపీ 15, ఆర్జేడీ 5, జేడీ (యూ) 13, కాంగ్రెస్ 2, ఎల్జేపీ 3, ఆర్ఎస్ఎల్పీ 1, వీఐపీ 1.
జార్ఖండ్‌లో 14 సీట్లుండగా… బీజేపీ 9, జేఎంఎం 2, కాంగ్రెస్ 2, ఏజేఎస్యూ 1.
గుజరాత్‌లో 26 సీట్లుండగా… బీజేపీ 24, కాంగ్రెస్ 2.
హిమాచల్ ప్రదేశ్‌లో 4 సీట్లుండగా… బీజేపీ 3, కాంగ్రెస్ 1.
మహారాష్ట్రలో 48 సీట్లుండగా, బీజేపీ 21, శివసేన 15, కాంగ్రెస్ 6, ఎన్సీపీ 6.
గోవాలో 2 సీట్లుండగా, బీజేపీ 1, కాంగ్రెస్ 1.
తమిళనాడులో 39 సీట్లుండగా, డీఎంకే 16, అన్నాడీఎంకే 10, కాంగ్రెస్ 4, బీజేపీ 1, పీఎంకే 2, ఇతరులు 6.
ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20, టీడీపీ 5.
తెలంగాణలో 17 సీట్లుండగా, టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఏఐఎంఐఎం 1.
కర్ణాటకలో 28 సీట్లుండగా, బీజేపీ 16, కాంగ్రెస్ 10, జేడీ (ఎస్) 2.
జమ్మూ కాశ్మీర్ లో 6 సీట్లుండగా, బీజేపీ 2, ఎన్సీ 3, కాంగ్రెస్ 1.
ఆసోంలో 14 సీట్లుండగా, బీజేపీ 6, ఏఐయూడీఎఫ్ 2, కాంగ్రెస్ 4, ఇతరులు 2.
ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 11 సీట్లుండగా, బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఎన్సీపీ 2, ఎన్డీపీపీ 1, ఎస్డీఎఫ్ 1.

ఇక ఢిల్లీలో మొత్తం లోక్‌సభ స్థానాలు 7.  ఈ ఏడు స్థానాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కవచ్చని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది.