‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది

- Advertisement -

విశాఖపట్టణం: అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సిబ్బంది స్టెప్పులతో ఇరగదీశారు. విమానాశ్రయంలో బ్యాక్ గ్రౌండ్‌లో పాట ప్లే అవుతుంటే సిబ్బంది డ్యాన్స్ చేశారు. మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్ ధరించిన ఎయిర్ హోస్టెస్‌లు, పైలెట్లు ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ తరహాలో బన్నీ పాటకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -
- Advertisement -