ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో నిర్వహించాలనుకున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

2019-2020 విద్యాసంవత్సరంలో ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సప్లిమెంటరీ ఫీజు కట్టిన వారికి వెనక్కి ఇచ్చేస్తామని మంత్రి చెప్పారు. అయితే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ యథాతథంగా జరుగుతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని అన్నారు.

- Advertisement -
- Advertisement -