వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు!?

1:51 pm, Sat, 27 April 19
YS Jagan Updates, AP Political News, Swearing News, Newsxpressonline

అమరావతి: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు కురిపించుకుంటూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తమకు జూన్ 8 వరకు గడువు ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపారు.

మరోవైపు అధికారంలోకి రాబోయేది వైఎస్ జగన్ అంటూ సీఎంగా ఆయన నేమ్ ప్లేట్ కూడా రెడీ చేసిన దృశ్యం ఆ మధ్య సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయింది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ అడుగు ముందుకేసి.. జగన్ ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించేశారు.

రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం ఇక పోయినట్లేనని. ఈ విషయం తెలిసే చంద్రబాబు జూన్ 8 వరకూ నేనే సీఎం అని అంటున్నారని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ బాబును ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు, ‘‘మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 వరకు ఎలా సీఎంగా ఉంటారు?’’ అని కూడా ప్రశ్నించారు.

చదవండి:  చంద్రబాబుకి బిగ్ షాక్! ఫలితాల ముందే వైసీపీలో జాయిన్ కాబోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి!

శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రం మీద ఆజన్మాంతం ఆయనకు మాత్రమే హక్కు ఉన్నట్టు ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.

ఏ కేసులో అయినా ఎక్కువ కాలం స్టే ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, బాబుపై పెట్టిన కేసులో విచారణ మొదలయ్యే సరికి దాన్నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఉన్నట్లుండి నార్త్ టూర్ అంటున్నారని రామకృష్ణారెడ్డి హేళన చేశారు.

చంద్రబాబు నాయుడు తన ఓటమికి ఈవీఎంలను కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తన ఎల్లో మీడియా ద్వారా దీనిని మరింత ప్రచారం చేయిస్తూ… ప్రజలు కూడా ఇదంతా నిజమేనేమో అనుకునే పరిస్థితి కల్పిస్తున్నారని, అయితే నిజాయితీ, నిబద్ధతలు కలిగిన ప్రతిపక్షంగా… ప్రజలకు నిజాలు తెలపాల్సిన బాధ్యత తమ మీద ఉందని అన్నారు.

2014లో అత్తెసరు ఓట్లతో బాబు ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని అందరూ గుర్తించాలని సజ్జల చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడకుండా.. సీఎం హోదాలో ఉండి కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ బాబు ఇలా గంగవెర్రులు ఎత్తుతున్నారంటూ ధ్వజమెత్తారు.

ఐదేళ్లలో రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్‌ ఇటుక కూడా వేయలేదని, చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రాజధాని పూర్తయ్యేది కాదా? అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

సరైన సమయంలో సమీక్షలు చేయకపోవడం వల్లే పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని చంద్రబాబు లేఖలో రాశారని, ఆ లేఖ చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ నెల రోజుల్లో చంద్రబాబు సమీక్షలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, దోచుకోగా మిగిలినవి ఏమైనా ఉంటే.. వాటిని కూడా కొట్టేయడానికే ఈ సమీక్షలు..’’ అని రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

చదవండి:  జగన్‌కి, చంద్రబాబుకి అదే తేడా! జగన్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేసే వార్త!