మరో మంత్రిని ప్రకటించిన జగన్! షాక్‌లో చంద్రబాబు!

1:03 pm, Tue, 9 April 19
jagan vs babu

మంగళగిరి : ‘‘నా సోదరుడు.. లోకల్‌ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పని చేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్తులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు..’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రతి కుంభకోణం, మోసం, వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు.

ఆర్కే నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు…

చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టనర్‌.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి రాగానే ‘నవరత్నాలు’తో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి (ఆర్కే)తో పాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిలను ఆదరించాలని.. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.