రిటర్న్ గిఫ్ట్ పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

6:42 am, Fri, 12 April 19
YS Jagan Latest News, AP Latest Political News, AP Election News, Newsxpressonline

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చి తీరతానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ఎంతగా ప్రచారంలో నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ ను ఈ రోజు పత్రికా సమావేశంలో ఈ విషయమై ఓ విలేకరి ప్రశ్నించారు.

‘రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందా?’ అని జగన్ ని ప్రశ్నించగా, ‘రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మ? నాకు అర్థం కాలేదు’ అని అన్నారు. ఈలోగా, తోటి విలేకరులు కల్పించుకుని ‘బాబుకు కేసీఆర్ ఇస్తానన్నారుగా’ అని అనడంతో, జగన్ స్పందిస్తూ, ‘బాబుకు, కేసీఆర్ కు మధ్య ఉంటే, వాళ్లను అడగాలి గానీ, నన్ను అడుగుతారేంటి?’ అని అన్నారు