ఈ ఎన్నికలలో జగన్ ఓడిపోతే జరిగేది అదేనా …?

12:28 pm, Tue, 30 April 19
YS Jagan Updates, AP Latest Political Updates, AP Election News, Newsxpressonline

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి దాదాపుగా 20 రోజులు కావొస్తుంది. అయినా కూడా ఎన్నికల వేడి ఇంకా తగ్గడం లేదు. ఎవరికీ వారు విజయం పై ధీమాగా ఉండటంతో సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. అలాగే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ, భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఊహాగానాలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు వచ్చాక భవిష్యత్ ఎలా ఉంటుందో రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో జగన్ ఓడిపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం..

ఏపీలో జగన్ పార్టీ అయిన వైసీపీ పార్టీ ఓడిపోతే పార్టీ దారుణంగా నష్టపోతుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ వచ్చిన అభ్యర్థులు, నాయకులు ఇంకా పార్టీని బతికించే పరిస్థితి ఉండదు అని సమాచారం. గెలిచిన కొద్ది మంది కూడా గతంలోలా టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంచనా వేస్తున్నారు.

అప్పుడు జగన్ కూడా ఎవరినీ ఏమీ అనే పరిస్థితి ఉండదు. జగన్ ఓడితే మరోసారి జగన్ కేసుల ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. అవసరమైతే మరో రెండు కేసులు పెట్టించైనా సరే జగన్ ను జైలు పాలు చేసే ప్రయత్నాలు జోరందుకుంటాయి అని చెప్తున్నారు. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ పొత్తులు పెట్టుకోని జగన్ ఇక ముందు ఆ పరిస్థితి కొనసాగించే అవకాశం లేకపోవచ్చు.

ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుంటే తప్ప భవిష్యత్‌ లో మనుగడలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా టీడీపీకి చుక్కలు చూపిస్తున్న పార్టీ రేపు జగన్ ఓడితే నామ్‌ కే వాస్తే గా మారిపోవచ్చు . ఇవీ జగన్ పార్టీ ఎన్నికల్లో ఓఢితే జరిగే పరిణామాలు. చూడాలి మరి ఫలితాలలో ఏంజరుగుతుందో …

చదవండి:  సంచలనం: ‘పీకే’ లాస్ట్ సర్వే, ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఇవే…