ఇది మినీ ఏపీ, ఆనందంగా ఉంది: నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్

3:51 pm, Thu, 21 March 19
Gajuwaka Assembly constituency Latest News, Janasena Latest Updates, Pawan Kalyan News, Newsxpressonline

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది.. అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. గాజువాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని.. ఇక్కడ సమస్యలపై ఏ రాజకీయ పార్టీలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.

అందుకే తాను ఇక్కడి నుంచి బరిలోకి దిగానని… అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలబెట్టామని.. క్రిమినల్ పొలిటీషియన్లపై యుద్ధానికి జేడీ లక్ష్మీనారాయణ బరిలో దించామని వెల్లడించారు పవన్.

రేపు భీమవరంలో నామినేషన్

కాగా, నామినేషన్‌ అనంతరం ఆయన గాజువాక, భీమునిపట్నం, విశాఖ సౌత్‌ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు.