జనసేన ఐదో జాబితా రిలీజ్: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే, తెలంగాణలో ఒక అభ్యర్థి పేరు

12:53 pm, Thu, 21 March 19
Jana Sena party releases 5th list News, MP candidates for 2019 elections News, Janasena Latest News, Newsxpressonline

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు జాబితాలుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించిన జనసేనాని తాజాగా బుధవారం రాత్రి ఐదో జాబితాను విడుదల చేశారు.

జనసేన పార్టీ నుంచి లోక్ సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో ఐదో జాబితాలో నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు.

లోక్‌సభ అభ్యర్థులు:
1. విజయనగరం – ముక్కా శ్రీనివాసరావు
2 కాకినాడ – జ్యోతుల వెంకటేశ్వరరావు
3 గుంటూరు – బి.శ్రీనివాస్
4. నంద్యాల – ఎస్.పి.వై.రెడ్డి
5. మహబూబాబాద్ (తెలంగాణ) – భూక్యా భాస్కర్ నాయక్

శాసనసభ అభ్యర్థులు:
1. సాలూరు : బోనెల గోవిందమ్మ
2. పార్వతీపురం : గొంగడ గౌరీ శంకరరావు
3. చీపురుపల్లి : మైలపల్లి శ్రీనివాసరావు
4. విజయనగరం : పెదమజ్జి హరిబాబు
5. బొబ్బిలి : గిరదా అప్పలస్వామి
6. పిఠాపురం : మాకినీడు శేషుకుమారి
7. కొత్తపేట : బండారు శ్రీనివాసరావు
8. రామచంద్రపురం : పోలిశెట్టి చంద్రశేఖర్
9. జగ్గంపేట : పాటంశెట్టి సూర్యచంద్ర రావు
10. నూజివీడు : బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11. మైలవరం : అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
12. సత్తెనపల్లి : వై.వెంకటేశ్వర రెడ్డి
13. పెదకూరపాడు : పుట్టి సామ్రాజ్యం
14. తిరుపతి : చదలవాడ కృష్ణమూర్తి
15. శ్రీకాళహస్తి : వినుత నగరం
16. గుంతకల్లు : మధుసూదన్ గుప్తా