జనసేన కి 88 సీట్లు పక్కా! సీఎంగా పవన్..జేడీ సంచలన వ్యాఖ్యలు!

12:04 pm, Thu, 18 April 19
jd comments on pavan

అమరావతి: ఏపీలో రాబోయే ప్రభుత్వం జనసేనదేనా, జనసేనకు ఒంటరిగానే 88 సీట్లు సాధిస్తుందా ,అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ. ఏది ఏమైనప్పటికి ఏపీలో అధికారం చేపట్టబోయేది జనసేననే అని అయన గట్టిగా చెప్తున్నాడు.

అలాగే తాను అఖిల భారత సర్వీసును వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు.సరే అధికారంలోకి వచ్చే విషయంలో జేడి చెప్పింది ఎంత వరకూ సాధ్యమో ఇప్పుడు చూద్దాం.
మొదటగా ఆలోచిస్తే..నిజానికి జనసేనకు పార్టీ నిర్మాణమే సరిగా లేదు. ఓటర్లున్నా వారిని ఓట్లుగా మలచుకునే యంత్రాంగమే లేదన్న విషయం అందిరకీ తెలిసిందే.

88 సీట్లతో జనసేన అధికారంలోకి రావటమే నిజమైతే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా కూర్చున్నారు. పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఈరోజు వరకూ పవన్ తరపున కనీసం ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు. ఇప్పటికే అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అని టీడీపీ , వైసీపీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే పవన్ మాత్రం ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు.

ఇక జనసేన తరపున పోటీ చేసిన వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో ప్రస్తుతం ఎవరూ ఒక అంచనాకి రాలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ గెలుపే సందిగ్దంలో పడిందంటున్నారు. కొందరేమో భీమవరంలో పవన్ ఓడిపోతారని చెబుతున్నారు. మరొకొందరేమో రెండు చోట్లా పవన్ కు ఓటమి తథ్యం అని మాట్లాడుతున్నారు.

మొదటి నుండి జనేసేన అంతర్గత వర్గాల లెక్కల ప్రకారం ఏపీలో జనేసేన గెలవగలిగేది మహా అయితే ఓ పది స్ధానాలు మాత్రమే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒకదానిలో పవన్ ఓడిపోతాడని ప్రచారం జరుగుతుంది. ఇక జేడి విషయానికి వస్తే టిడిపి పుణ్యమా అని రెండో స్ధానానికి వస్తాడని పార్టీ నేతలే చెబుతున్నారు.

మామూలుగా అయితే జేడి రెండోస్ధానానికి కూడా వచ్చే అవకాశం లేదు. టిడిపి తరపున పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ ఓటమే ధ్యేయంగా పార్టీలో ముఖ్యనేతలు పావులు కదిపారని అంటున్నారు. భరత్ ను ఓడించేందుకే టిడిపి వాళ్ళు జనేసేనకు క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. క్రాస్ ఓటింగ్ లో ఓట్లు పడటమే నిజమైతే జేడి రెండోస్ధానంలో నిలుస్తారని అంటున్నారు. వాస్తవం ఇలాగుంటే రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జేడి చెబితే వినడానికి బాగున్నా , నమ్మశక్యం కావడంలేదు..చూద్దాం ఈ ప్రజాస్వామ్యం లో ఏదైనా సాధ్యమే…