నేనప్పుడే చెప్పాను.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా ఉద్రిక్తతలపై ఆయన మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.

కరోనా వైరస్‌ను చైనా వ్యూహాత్మకంగానే ప్రయోగశాల నుంచి పంపించిందని అన్నారు. ప్రపంచానికి ముందుగా ఈ విషయం గురించి చెప్పింది తానేనన్నారు.

- Advertisement -

చైనా బలగాల చేతిలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారంటే దానికి కారణం ఎవరన్న పాల్.. చైనాకు దీటైన నాయకుడు ప్రపంచంలో లేకపోడమే అందుకు కారణమని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో అనధికార ఒప్పందాలు పెట్టుకుని వ్యాపారం చేస్తోందని పాల్ ఆరోపించారు. రష్యా మద్దతు కూడా దానికి ఉందన్నారు.

కరోనా వైరస్ ద్వారా ఈ ప్రపంచానికి చైనా తీవ్ర నష్టం కలిగించిందని కేఏ పాల్ మండిపడ్డారు.

దేశాన్ని రక్షించుకునేందుకు మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పనిచేద్దామని, దేశాభివృద్ధికి హిందూ, ముస్లింలు, క్రిస్టియన్, బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరినీ ఏకం చేద్దామని తాను గతంలో అనేక సమావేశాల్లో చెప్పానన్నారు.

చదవండి: కరోనా వైరస్: నా వంతు సేవలు వాడుకోండి.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్…

 

- Advertisement -