కేఏ పాల్‌కు ఊహించని షాక్! నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు, అక్కడా డౌటే…

5:56 pm, Mon, 25 March 19
KA Paul Latest News, KA Paul Namination News, AP Latest News, Newsxpressonline

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. సోమవారం నరసాపురంలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన వెంటనే భీమవరం బయలుదేరారు.  కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో భీమవరంలో నామినేషన్‌ను సంబంధిత అధికారులు తిరస్కరించారు. 

‘‘నన్ను ఆలస్యంగా వచ్చేలా చేశారు…’’

నరసాపురంలో తాను ఎంపీ నామినేషన్‌ వేయడానికి వెళ్లగా చాలా ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్‌ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారంటూ మండిపడ్డారు. తాను కచ్చితంగా గెలుస్తానన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా వారు చేశారని విమర్శించారు.

నరసాపురంలోనూ డౌటే…

నరసాపురంలో ఎంపీగా గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. ఇకపోతే సాధారణంగా నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాల్నీ పూర్తి చెయ్యాల్సిందే. అక్కడ ఆప్షన్ ఉండదు.

ఒకవేళ తమకు సంబంధం లేని అంశాలేవైనా ఉంటే, అక్కడ నాట్ అప్లికేబుల్ (NA) అని అయినా రాయాలి. కానీ కేఏ పాల్ సమర్పించిన పేపర్లలో దాదాపు సగం ఆప్షన్లు ఖాళీగానే ఉన్నాయి. అలా ఇస్తే కుదరదు. నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.