ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. విశాఖ వైపు వెళ్తుండగా అదుపులోకి

- Advertisement -

రాజమండ్రి: మచిలీపట్టణంలో జరిగిన మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు తుని మండలం సీతారాంపురం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రవీంద్రను విజయవాడ తరలించారు.

- Advertisement -

అంతకు ముందు భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం రవీంద్ర ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. రవీంద్ర కోసం పోలీసులు ఆయన ఇంటిని రెండు సార్లు గాలించారు. ఈ సందర్భంగా ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌ సమీపంలో భాస్కర్‌రావును కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

 

- Advertisement -