నియంతలే షాకయ్యేలా జగన్ క్రూరత్వం: కొల్లు రవీంద్ర

- Advertisement -

అమరావతి: ఏపీ శాసన మండలిలో మంత్రుల వ్యవహార శైలిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ క్రూరత్వం నియంతలే నిర్ఘాంతపోయాలా ఉందన్నారు.  టీడీపీ నేతలు తప్పు చేశారంటున్న మంత్రులు మండలి వీడియోలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

జగన్ ఏడాది పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి అనేదే లేదన్నారు. దేవాలయం లాంటి చట్టసభలను అరాచకాలకు బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రుల తీరు చూసి జనం విస్తుపోతున్నారని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుందామని ప్రతిపక్షాలు కోరుతుంటే మంత్రులు వద్దని వారించడం దుర్మార్గమన్నారు.

- Advertisement -

సెలక్ట్ కమిటీ, కోర్టుల్లో ఉన్న బిల్లులుపై మంత్రులు పట్టుబట్టడం కంటే దారుణం మరోటి ఉండదన్నారు.  తొడకొట్టడం, మీసాలు మెలేయడం, ప్యాంట్ జిప్ తెరవడం సిగ్గు చేట్టన్నారు. మంత్రులు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని దుమ్మెత్తి పోశారు.

మహిళా సభ్యులు తలదించుకునేలా మంత్రులు వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలు దాడి చేశారని చెబుతున్న వైసీపీ నేతలు దమ్ముంటే ఆ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలను అణచివేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని రవీంద్ర ఆరోపించారు.

- Advertisement -