లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్! వైసీపీలోకి మరో సీనియర్ కీలక నేత!

4:46 pm, Wed, 1 May 19
YS Jagan Updates, AP Latest Political Updates, Purandeswari Latest News, Newsxpressonline

అమరావతి: ఏపీలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. విజయం పై అన్ని పార్టీలు కూడా తమ ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే వైసీపీ , టీడీపీ మరో అడుగు ముందుకేసి , అప్పుడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహుర్తాలు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ తరుణంలో మళ్ళీ పార్టీలలో చేరికలు ఊపందుకున్నాయి.

ఎన్నికల ముందు వరకు టీడీపీలోకి చేరిన నేతలు , నేడు రాష్ట్ర ప్రజా పరిస్థితుల మేరకు వైసీపీ లో చేరడానికి ఒక్కొక్కరుగా సిద్దపడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత వైసీపీలో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అవును ఎన్నికలకు ముందునుండి ఉన్న ఇదే ప్రచారం తొందరలో వాస్తవం కాబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే మాజీ మంత్రి, పర్చూరులో వైసిపి ఎంఎల్ఏగా పోటీ చేసిన పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

చదవండి:  ఏపీ సీఎంగా జగన్! ముహూర్తం ఫిక్స్..ఇదే రుజువు!

పురంధేశ్వరి కోసం వైసిపి పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని దగ్గుబాటి చెప్పటంలోనే విషయం అర్ధమైపోతోంది. యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి ఎప్పుడైతే వైసిపిలో చేరారో అప్పుడు అర్ధమైపోయింది అందిరకీ బిజెపి నేత పురంధేశ్వరి కూడా వైసిపిలోకి వచ్చేస్తారని. కాకపోతే ఎన్నికలకు ముందు పార్టీ మారటం ఇష్టం లేక అలాగే ఉండిపోయారు.

అందుకనే కొడుకు చెంచురామ్ కోసమని ముందుగా దగ్గుబాటి వైసిపిలో చేరారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కొడుకు ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం లేకపోయింది. దాంతో చివరి నిముషంలో దగ్గుబాటే రంగంలోకి దిగారు. అదే విషయాన్ని దగ్గుబాటి చెబుతూ పురంధేశ్వరి చేరాలని అనుకుంటే వైసిపిలోకి ఎప్పుడైనా రావచ్చన్నారు. రాష్ట్రంలో బిజెపికి పెద్దగా భవిష్యత్తు కూడా లేదని అభిప్రాయపడ్డారు.

తొందరలోనే అంటే ఎన్నికల ఫలితాల తర్వాత పురంధేశ్వరి ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చనే అర్ధం వచ్చేట్లుగా చెప్పారు.కాబట్టి అందరూ ఊహించినట్లుగానే తొందరలో పురంధేశ్వరి వైసిపి ఎంట్రీ జరుగుతుందని అనుకుంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ నే మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో వైసిపి గనుక అధికారంలోకి వస్తే పురంధేశ్వరి బిజెపిలో ఉన్నా ఒకటే వైసిపిలో ఉన్నా ఒకటే.

చదవండి:  జగన్ కి బిగ్ షాక్! చంద్రబాబు గెలిస్తే మళ్ళీ అక్కడే ప్రమాణస్వీకారం!