లేటెస్ట్ సర్వే : ఏపీలో టీడీపీ గెలవబోయే 5 ఎంపీ స్థానాలు ఇవే!

10:47 am, Thu, 25 April 19
TDP Latest News, TDP Latest News, AP Political News, Newsxpressonline

అమరావతి: ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ సర్వేల అంచనాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కచ్చితత్వం కోసం కాస్త టైమ్ తీసుకున్నామని చెబుతున్న సంస్థలు కొన్ని ఆలస్యంగా అంచనాలు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని మాత్రం పోలింగ్ ముగిసిన మరుసటిరోజే తమ ఎన్నికల ఫలితాలని ప్రకటిస్తున్నాయి.

ఈ తాజా సర్వే ప్రకారం ఏపీలో ఎంపీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 18 ఎంపీ స్థానాలు వైసీపీ కచ్చితంగా గెలుచుకుంటుందన్నది. ఈ సర్వ అంచనా వేసింది. టీడీపీ కచ్చితంగా ఐదు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోంది అని, మరో రెండు ఎంపీ స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది.

టీడీపీ కచ్చితంగా గెలిచే లోక్ సభ స్థానాలు ఏవంటే విజయనగరం ఎంపీ స్థానంలో అశోక్‌ గజపతిరాజు మరోసారి ఎంపీగా గెలవడం ఖాయంగా చెబుతున్నారు. అలాగే ఏలూరులో మాగంటి బాబు మరోసారి ఎంపీ గా విజయం సాధించడం పక్కా అట. అలాగే అనంతపురంలో జేసీ పవన్ గెలుపు ఖాయం అని తెలుస్తోంది.

మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ మరోసారి ఎంపీ కాబోతున్నారట. చిత్తూరు స్థానాన్ని ప్రత్యేక వేషాల శివప్రసాద్ మరోసారి నిలబెట్టుకుంటారట. ఇవీ కచ్చితంగా టీడీపీ గెలిచే స్థానాలు. వీటికితోడు నంద్యాల, కర్నూలులో టఫ్ ఫైట్ నడుస్తోందట.. ఈ స్థానాల్లో వైసీపీకి ఎడ్డ్ ఉన్నా పక్కాగా గెలుస్తుందని చెప్పే పరిస్థితి లేదు. పూర్తి ఫలితాలు వెలువడాలి అంటే మే 23 వరకు వేచి చూడక తప్పదు..

చదవండి: టీడీపీకి షాక్! జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు పరిస్థితి అత్యంత విషమం!