ఏపీలో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే! వైసీపీకి 110 సీట్లు ఖాయమట!

11:29 am, Wed, 8 May 19
YS Jagan Latest Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Survey News , Newsxpressonline

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి నెల రోజులు కావొస్తున్నా , ఎన్నికల వాతావరణం అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే ఎన్నికల పోలింగ్ ముగుసినప్పటినుండి ఏపీలో జగన్ అధికారానికి వస్తాడని చెప్పే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే అనేక రకాలైన సర్వేలు జగన్ దే అధికారం అని చెప్పుకొచ్చాయి.

తాజాగా ఇపుడు ఏపీలో వైసీపీదే విజయం..జగన్ సీఎం అంటూ మరో మాట గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో టీడీపీకి ఈసారికి ప్రతిపక్షమేనని కూడా చెప్పేస్తున్నారు. ఏపీలో టీడీపీ కి ఈసారి గడ్డుకాలమేనని, టీడీపీ నేతల అహంకారాలకి కాలం చెల్లబోతుంది అని చెప్తున్నారు.

చదవండి: సంచలనం: చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ యూపీఏకే మద్ధతిస్తారట….

కేంద్రంలో అధికారం కలిగిన బీజేపీ తనకున్న పవర్ తో, ఇంటెలిజెన్స్ సర్వేల ఆధారంగా ఏపీలో వైసీపీదే అధికారం అని ప్రకటించింది. బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వైసీపీ కి ఏపీలో 110 సీట్లు వస్తాయని తేల్చేశారు. దీనితో వై ఎస్ జగన్ సీఎం అవడమే ఖాయమని కూడా ఆయన పక్కాగా చెప్పేశారు.

అలాగే మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ అని ఒక చోట సీట్లు తగ్గితే దాన్ని మరో చోట భర్తీ చేసుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు. రెండు తెలుగు రాష్టాలో సీట్ల లోటుని తమిళనాడుతో పూడ్చుకుంటామని మురళీధరరావు అన్నారు.

తెలంగాణాలో తెరాస కి అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఏపీలో జగన్ కాబోయే సీఎం అని బీజేపీ కూడా తేల్చేసింది. నిజమైన ఫలితాలు తెలియాలి అంటే ఈ నెల 23 వరకు వేచి చూడక తప్పదు..

చదవండి:  మంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిడారి శ్రవణ్‌!