అధికారం ఎవరు చేప్పట్టినా మ్యాజిక్ ఫిగర్ 90 .. లేటెస్ట్ సర్వే!

11:56 am, Wed, 17 April 19
Ap Latest News, AP Latest Survey News, AP Election News, Newsxpressonline

అమరావతి : ఎన్నికల ప్రజాస్వామ్యం అంటేనే నంబర్ గేం. ఎవరు ఎక్కువ సంఖ్యను తెచ్చుకున్నరన్నదే ఇక్కడ ప్రధానం. మిగిలిన విషయాలు పక్కన పెడితే ఎవరి వెనక ఎక్కువ మంది ఉంటే వారే రాజు అవుతారు. అదే ఇక్కడ కావాల్సింది.

మరి హోరా హోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో విజేత ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సంగతి. తలపండిన వారు సైతం తేల్చలేకపోతున్నారు. ఇక రాజకీయ కురు వృధ్ధుడు.. గోదావరి జిల్లాలకు చెందిన చేగొండి హరి రామజోగయ్య ఈ విషయంపై తనదైన విశ్లేషణను అందించారు.

చదవండి: బాబుకి పవన్ రిటర్న్ గిఫ్ట్! షాక్ లో తెలుగు తమ్ముళ్లు!

ఆయన మాటల ప్రకారం చూస్తే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 90 సీట్లకంటే ఎక్కువ రావట. అధి టీడీపీ అయినా, వైసీపీ అయినా ఆ సంఖ్యను దాటదని పెద్దాయన తేల్చేశారు. ఇక మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. టీడీపీకి జనసేన దెబ్బ అలా ఇలా ఉండదుట.

ఆ పార్టీ కారణంగా చాలా ఓట్లను, సీట్లను కూడా కోల్పోతుందని జోగయ్య క్లారిటీగా చెప్పారు.  అదే విధంగా ఎస్సీ ఓట్లను కూడా జనసేన చీల్చుతుందని దాని వల్ల వైసీపీకి కూడా నష్టమేనని విశ్లేషించారు.

మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికలు ఏకపక్షం కావని, హరా హోరీ పోరులో చావు తప్పి కన్న లొట్టబోయిన చందంగా ప్రధాన పార్టీలో ఒకటి 90 సీట్లను తెచ్చుకుంటుందని చెప్పారు.

అది టీడీపీ అయినా వైసీపీ అయినా కావచ్చునంటూ హింట్ ఇచ్చారు. అంటే రేపటి రోజున ఏపీలో ఏర్పాటయ్యే సర్కార్ అరకొర మెజార్టీతోనేనన్నమాట. ఇది పెద్దాయన చెప్పిన మాట.