లోకేష్ నకిలీ ..ఎన్టీఆర్ ఒరిజినల్! వర్మ సంచలన వ్యాఖ్యలు!

Nara Lokesh Latest News, NTR Latest News, RGV Latest News, Newsxpressonline
- Advertisement -
హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రపంచమంతా విడుదలైనా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. అత్యంత వివాదాస్పద సినిమాపై పూర్తి పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్లు అంచనాలకు మించి రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక సహజంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకి బ్రేక్ పడింది. సినిమా దర్శక నిర్మాతలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. ఫలితంగా. ఏప్రిల్ 3న అంటే ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఏపీలో రిలీజ్ చెయ్యాలా వద్దా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిపోవాలంటే, ఏప్రిల్ 11 వరకూ ఆగాలి. అప్పటివరకూ రిలీజ్ చెయ్యకూడదని న్యాయమూర్తులు భావిస్తే మరో వారం సినిమాకి బ్రేక్ పడినట్లవుతుంది. దర్శక, నిర్మాతల కోణంలో ఆలోచిస్తే, అది ఎంతమాత్రం సమంజసం కాదు.

ఎందుకంటే, ఇప్పటికే పైరసీ కారణంగా ఇలాంటి సినిమాలు చూసేందుకు చాలా మంది ప్రజలు థియేటర్లకు రాకముందే పైరసీలో చూసేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సినిమాని ఎంతకాలం వాయిదా వేస్తే, అంతకాలం నిర్మాతకు నష్టం తప్పదన్నది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి న్యాయమూర్తులు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికాసేపట్లో తేలుతుంది.

కోర్టు వివాదం ఇలా ఉంటే, రాంగోపాల్ వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాపై ఏపీలోని ఆయన అభిమానుల్లో ఉన్న ఆసక్తిని ఆలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు.

 
తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని టార్గెట్ చేశాడు. టీడీపీకి చంద్రబాబు తన వారసుడిగా లోకేష్‌ని ప్రజెంట్ చేస్తుంటే, నారా లోకేష్ ఓ అబద్ధం అని తేల్చేశాడు వర్మ. టీడీపీకి అసలైన ఫ్యూచర్ జూనియర్ ఎన్టీఆరే అన్నాడు.

అంతేకాదు, తారక్‌తో పాటూ నిజాయితీ గల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాతే ఓటు వెయ్యాలని కోరాడు.ఇలా వర్మ ఈ సినిమాపై హైప్ పెంచుతుండటంతో ప్రస్తుతానికి ఈ సినిమా కోసం ఏపీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ఏపీ ప్రజలు థియేటర్లలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళైనా ఆర్జీవీకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేక… టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..

- Advertisement -