మంగళగిరిలో లోకేష్ ఓటమి తథ్యం! ఆస్థాన మీడియా తాజా సర్వేలో వెల్లడి!

12:29 pm, Thu, 2 May 19
Mangalagiri Latest Political Updates, Nara Lokesh Latest News, AP political , Newsxpressonline

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల తర్వాత హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ లోకేశ్ గెలుస్తారా? లేదా? అన్నది టీడీపీ, వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అయితే తాజాగా వచ్చిన ఓ సర్వే  మాత్రం మంగళగిరిలో లోకేశ్ ఓటమి ఖాయం అని తేల్చి చెప్పేసింది. పైగా ఏపీ న్యూస్ యూట్యూబ్‌లో విడుదలైన ఈ సర్వే నిజం కాకపోతే ఛానల్ మూసేస్తామని సవాల్ విసరడం విశేషం.

చదవండి:  ఏపీ సీఎంగా జగన్! ముహూర్తం ఫిక్స్.. ఇదే రుజువు!!

ఈ ఛానల్ లెక్క ప్రకారం జనసేన పార్టీ కచ్చితంగా 53 స్థానాల్లో గెలుస్తుందట. విచిత్రం ఏంటంటే జనసేన గెలుపు సీట్ల జాబితాలో మంగళగిరి కూడా ఉందట. మంగళగిరిలో లోకేశ్ తప్పకుండా గెలుస్తారని టీడీపీ శ్రేణులు దీమాగా ఉన్నాయి. కానీ ఆర్కే గట్టిగా పోటీ ఇచ్చారని ఆర్కే గెలుస్తారని వైసీపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. ఈ స్థానాన్ని వామపక్షాలకు కేటాయించింది.

కానీ విచిత్రంగా ఏపీ న్యూస్ ఛానల్ సర్వేలో జనసేన మంగళగిరి సీటును గెలుచుకుంటుందని చెప్పింది. అంటే లోకేశ్ ఓడిపోతున్నాడని చెప్పినట్టేగా, అంతే కాదు ఇక్కడ గెలిచేది కూడా వైసీపీ కాదు. జనసేన కూటమికి చెందిన వామపక్షాల అభ్యర్థి. ఇది ఎంతవరకూ నిజమో కాలమే తేల్చాలి.

చదవండి:  ఏపీలో రెడ్లు అందరూ జగన వైపే! టీడీపీ గెలిస్తే ఆ ఒక్కటే కారణం! జేసీ…