ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

- Advertisement -

అమరావతి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు.

ఈ దుర్ఘటనలో 7 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు.

- Advertisement -

ఇక ఈ రోడ్డు ప్రమాదంలో మరో 14 మంది క్షతగాత్రులుకాగా.. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

గాయపడిన వారందరినీ జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారందరూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన వారు.

వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. 

ఆలయ సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. బాధితులు ప్రయాణిస్తోన్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన సిమెంట్ లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఆ సమయంలో అందులో 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో కూడా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు కూడా అంటున్నారు.

 

- Advertisement -