వైసీపీ గెలిస్తే ఆ టీడీపీ నేతలు జంప్ అవ్వడం ఖాయమేనట…!

3:54 pm, Thu, 9 May 19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి వైసీపీనే గెలవబోతుందని విపరీతమైన ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రచారానికి తోడు చాలా సర్వేలు వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సుమారు 30 మంది టీడీపీ నేతలు జంప్ చేసేందుకు చూస్తున్నారట.

ఎప్పటికప్పుడూ తాజా పరిస్థితులని అంచనా వేస్తూ…జంపింగ్‌కి రెడీగా ఉన్నారని సమాచారం.  అయితే వీరు జంప్ చేయడానికి కారణాలు లేకపోలేదు. చాలామంది టీడీపీ నేతలకి అటు పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో, ఇటు ఏపీలో వ్యాపారాలు ఉన్నాయి.

చదవండి:టీడీపీ నేత సొంత సర్వే లో బయటపడ్డ అసలు నిజం! ఏ పార్టీ కి…

అధికారం లేకపోతే కష్టమే…

ఈ తరుణంలో అధికారంలో ఉన్న పార్టీ అండ‌దండ‌లు లేకపోతే.. ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్పవ‌ని వీరు భావిస్తున్నారు. ఇలాంటి వారిలో గుంటూరు, కృష్ణా, విశాఖ‌, ప్రకాశం, నెల్లూరుకు చెందిన నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఒక మంత్రి కూడా గెలిచి… రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కాక‌పోతే.. ఆవెంట‌నే జ‌గ‌న్‌కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

పైగా ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. కోట్లకు కోట్లు ఖ‌ర్చు పెట్టి గెలిచిన త‌ర్వాత‌.. పార్టీ అధికారంలోకి రాక‌పోతే.. స్వలాభం చూసుకుంటే త‌ప్పేంటి? అన్నట్లు వారు ఉన్నారంట. చూద్దాం మరి అసలు 23 తర్వాత ఏం జరుగుతుందో?

చదవండి: ఆ జిల్లాలో టీడీపీదే మెజారిటీ అంటా…!